Friday, 15 July 2016

We never forget what we have stored in our mind


ఒక ప్రయోగంలో ఒక వ్యక్తి మెదడులో కొన్ని భాగాలకు సన్నని తీగలాంటి ఎలక్ట్రోడ్స్ను అమర్చారు. వాటిని ప్రేరేపించినప్పుడు, మెదడులో దానికి సంబంధించిన భాగం ప్రేరేపించి, ఆ వ్యక్తి అనేక ఏండ్ల క్రితం జరిగిన సంఘటనను అప్పుడే జరుగుతున్నంత క్లియర్‌గా వర్ణించి చెప్పాడు. అదే సమయంలో ఆ సంఘటన ఎదురుగా జరుగుతున్నప్పుడు పొందే ఉద్వేగానుభవానికి కూడా లోనయ్యాడు. దీన్ని బట్టి జ్ఞాపకశక్తి ఎప్పటికీ చెరిగిపోదని తేలింది. సాధారణంగా విద్యార్థులనేకమంది తమకు జ్ఞాపకశక్తి చాలా తక్కువని, చదివింది వెంటనే మర్చిపోతామని అంటూ ఉంటారు. ఇది కేవలం దురభిప్రాయం మాత్రమే. శాస్త్రీయంగా మరిచిపోవటం అనేది మన మెదడులో లేదు. జ్ఞాపకం తెచ్చుకోవడంలో విఫలం కావటం మాత్రమే ఉంటుంది. ఒకసారి తీసిన ఫొటో నెగెటివ్‌లో భద్రంగా ఉన్నట్లే. మన మెదడులో ఇంద్రియాల ద్వారా గ్రహించిన సమాచారం యధాతథంగా నిక్షిప్తమై ఉంటుంది.

సైకాలజీలో జ్ఞాపకశక్తి అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం అందరికీ తెలిసిందే! చదివిన విషయం లేదా చూసిన దృశ్యం.. విన్నది. అనుభవించినది.. ఏదైనా సరే. ఒకసారి జీవితంలో జరిగింది ఏదైనా... మళ్లీ గుర్తుకుతెచ్చుకోవడానికి వీలుగా బుర్రలో ఉంచుకొనే శక్తినే జ్ఞాపకశక్తి అంటాం. దీని నిర్వచనం చాలా సింపులే! మన మెదడులో ఈ జ్ఞాపకశక్తి ప్రక్రియకు మాత్రం చాలా సంక్లిష్టమైన విధానం ఉంది. దాన్ని అర్థం చేసుకొంటే జ్ఞాపకశక్తి ఎలా పెంపొందించుకోవచ్చునో తెలుస్తుంది. వ్యక్తిత్వ వికాసంలో జ్ఞాపకశక్తి చాలా ముఖ్యమైనది. ఒక వ్యక్తి తార్కికంగాను, సమంజసనీయంగానూ ఆలోచించాలంటే తన పూర్వానుభవాలను జ్ఞప్తికి తెచ్చుకోవాలి. నేర్చుకున్న అంశాలను స్మృతిపథంలో ఉంచుకోవాలి. అవసరమైనప్పుడు ఉపయోగించుకోగలగాలి. నేర్చుకోవటం ద్వారా ఏర్పడే విజ్ఞానం సమస్య పరిష్కారానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు. ముఖ్యంగా నేర్చుకోవటం ప్రక్రియలకు జ్ఞాపకశక్తి ఎంతైనా తోడ్పడుతుంది.

స్మృతి ఎప్పటికీ చెరిగిపోదు:
కంప్యూటర్లో ఒకసారి పంపిన సమాచారం శాశ్వతంగా ఉండిపోయినట్టే మన మెదడు అనే కంప్యూటర్‌కు అందించిన (సక్రమమైన ఇంద్రియ మాధ్యమంతో) సమాచారం ఏదీ చెరిగిపోదు. మెదడు గురించి పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలు ఒక ప్రయోగంలో ఒక వ్యక్తి మెదడులో కొన్ని భాగాలకు సన్నని తీగల్లాంటి ఎలక్ట్రోడ్స్ను అమర్చారు. వాటిని ప్రేరేపించినప్పుడు, మెదడులో దానికి సంబంధించిన భాగం ప్రేరేపించి, ఆ వ్యక్తి అనేక ఏండ్ల క్రితం జరిగిన సంఘటనను ఇప్పుడే జరుగుతున్నంత క్లియర్‌గా వర్ణించి చెప్పాడు. అదే సమయంలో ఆ సంఘటన ఎదురుగా జరుగుతున్నప్పుడు పొందే ఉద్వేగానుభవానికి కూడా లోనయ్యాడు. ఆ వ్యక్తికి అంతగా ఉపయోగపడని, ఇష్టతలేని, ఏనాడో జరిగిపోయిన అతి చిన్న విషయం కూడా ఇప్పుడు గుర్తుకురావడం, ఆనాటి అనుభూతిని ఉద్వేగాన్ని యథాతథంగా తిరిగి అనుభవించటం మనం గమనించదగ్గ అంశాలు.

స్మృతి వెనుక బ్రెయిన్లో జరిగే ప్రక్రియలు:
సాధారణంగా ఏవిషయం గురించయినా తెలుసుకొనేటప్పుడు ఆ అనుభవం, ఉద్దీపన (లేదా సమాచారం) వివిధ జ్ఞానేంద్రియాల ద్వారా మెదడులో రికార్డు అవుతుంది. అదెలా రికార్డు అవుతుందో ఇందాక చెప్పుకున్నాం. రికార్డు కావటం పూర్తయ్యాక, మెదడులో కొంత మార్పు ఏర్పడుతుంది. ఈ మార్పునే ఎన్గ్రామ్ లేక స్మృతి చిహ్నం (MEMORY TRACE) అంటారు. జ్ఞానేంద్రియాల ద్వారా ఎంతో సమాచారం మనదాకా వచ్చినా మన అవరోధాన్ని బట్టి కొంత సమాచారమే నాడీ మండలంలోని ఉన్నతస్థాయి ప్రక్రియల్లో ప్రవేశిస్తుంది. రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ (ఉత్తేజ నాడీ జల వ్యవస్థ) అనే ఒక భాగం మన అవరోధాన్ని నియంత్రిస్తుంది. మెంటల్ స్టేట్, ఉద్దీపనలో తీవ్రత, అవధానం ఫైనల్‌గా ఏకాగ్రత ఇవి జ్ఞాపకశక్తిని నిర్దేశిస్తాయి.


స్మృతిలో రకాలు:
జ్ఞాపకశక్తి ముఖ్యంగా రెండు రకాలు. ఒకటి రివాజుగా చేసే పనులను గుర్తుంచుకోవటాన్ని ప్రొసీజర్ మెమరీ అంటాం. రెండోది కొత్త విషయాలను గుర్తించుకోవడాన్ని సెమాంటిక్ మెమరీ అని అంటారు.
ప్రొసీజరల్ మెమరీ : మనం రోజూ అనేక పనులు చేస్తుంటాం. సైకిల్ తొక్కడం, కారు నడపటం, కంప్యూటర్ ఆపరేట్ చేయడం ఇలా వృత్తిపరమైనవి. అందుచేత వీటిని మర్చిపోయే ప్రసక్తి ఉండదు. దీన్ని PROCEDURAL MEMORY అంటారు.
సెమాంటిక్ మెమరీ
ఇక రెండో రకమైన సెమాంటిక్ మెమరీ విషయానికి వద్దాం. భావాలు, నిర్వచనాలు ఈ స్మృతిలోకి వస్తాయి. ఇది ప్రధానంగా రెండు రకాలు.
1. స్వల్పకాలిక స్మృతి (ఎస్టీఎం)
2. దీర్ఘకాలిక స్మృతి (ఎల్‌టీఎం)
అలాగే జ్ఞాపకశక్తికి మూడు దశలు (స్థాయిలు లేదా స్టేజీలు) ఉంటాయి. ఈ మూడు దశలను Rలుగా వ్యవహరిస్తారు.


జ్ఞాపకశక్తిపైన అనేక ప్రయోగాలు చేసినవారిలో ఎబ్బింగ్ హాస్ ముఖ్యుడు. ఈయన ప్రధానంగా జ్ఞాపకశక్తి గురించి వివరించాడు.

స్వల్పకాలిక స్మృతి :
ఏదైనా సమాచారం మెదడును చేరినప్పుడు స్వల్పకాలిక స్మృతిలో ఉంటుంది. దీన్ని మెదడు విశ్లేషిస్తుంది. వ్యాఖ్యానిస్తుంది. రిజిస్ట్రేషన్ దశలో కన్నా.. ఈ స్థాయిలో స్మృతి ఎక్కువసేపు ఉంటుంది. సమాచారం కొన్ని సెకన్లపాటు(దాదాపు 20 సెకన్లు) ఇక్కడ నిలిచి, అది ఇంకా గుర్తుంచుకోవాల్సిన సమాచారం అయితే దీర్ఘకాలిక స్మృతిలోకి చేరుతుంది. లేదా అక్కడికక్కడే విస్మృతి పాలవుతుంది.

దీర్ఘకాలిక స్మృతి :
కొన్ని గంటలు, రోజులు, నెలలు, ఏండ్లు లేదా జీవన పర్యంతం గుర్తుండే స్మృతి ఇది. సమాచారం ఎక్కువ కాలం ఉండేది ఇక్కడే. దీర్ఘకాలిక స్మృతికి అవధులు ఉండవు. ఈ స్మృతిపథంలో రికార్డు అయిన విషయం చెరిగిపోయే ప్రసక్తే లేదు. పునఃశ్చరణ కష్టం కావచ్చునేమోకానీ, ఫలానా విషయం మెదడులోంచి కనుమరుగైపోవడం ఉండదు. రిగ్రేషన్లో ఏం జరుగుతుంది? ఒక వ్యక్తిని డీప్ ట్రాన్స్‌లోకి పంపి అతని పూర్వపు జీవితానికి, వెనక్కి తీసుకెళ్లే ప్రక్రియను ఏజ్ రిగ్రెషన్ అంటారు. ఈ విధానం ద్వారా వ్యక్తిని ఒక నిర్దిష్టమైన చోట ఆపినప్పుడు, ఆ వయసులో అతనికి జరిగిన ఒక సంఘటనను వివరించమని కోరితే ఆ వ్యక్తి ఆ సంఘటనను యథాతథంగా తన చుట్టూ ఉన్న వ్యక్తుల పేర్లు, వాళ్లు వేసుకున్న దుస్తుల రంగులు వంటి చిన్నచిన్న వివరాలతో సహా క్లియర్‌గా వివరిస్తాడు. అంతేకాకుండా, ఫలానా సంఘటన జరుగుతున్నప్పుడు అతనికి కలిగిన మానసిక ఉద్వేగానుభూతిని కూడా యథాతథంగా పొందుతాడు. అందువల్ల బ్రెడయన్కు ఇంద్రియానుభూతుల ద్వారా అందే ఏ సమాచారమైనా సరే చెరిగిపోయే ప్రసక్తి లేదు. కాబట్టి మహామేధావులైన వ్యక్తుల దగ్గర నుంచి, అతి సామాన్యుడైన మనిషి వరకూ అందరి మెదళ్లూ ఒకేలా పనిచేస్తాయి. ఒకే విధమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఎరిక్సన్, ఛేజ్ వంటి శాస్త్రజ్ఞులు, అసాధారణమైన జ్ఞాపకశక్తిని ప్రదర్శించే వారిలో సూపర్‌మేన్ క్వాలిటీస్ అంటూ ప్రత్యేక లక్షణాలేవి ఉండవని అంటారు.

మరుపునకు కారణాలు :
 మనం దేన్నయినా లేదా చదివే ఏ విషయాన్నయినా ఎందుకు మర్చిపోతాం? మనం అనుభవించిన లేదా అనుభూతికి లోనయిన విషయాలు మన స్మృతిపథంలో మెమరీ ట్రేసెస్ (స్మృతి చిహ్నాలు)గా నమోదవుతాయని తెలుసుకున్నాం. ప్రతి స్మృతి చిహ్నం నిర్దిష్టమైన మోతాదులో మానసిక శక్తి వినియోగించడం మూలంగా ఏర్పడుతుంది. ఎక్కువకాలం పాటు గుర్తుంచుకోవాల్సిన అంశాలకు ఎక్కువ మానసిక శక్తి వెచ్చించాలి. స్మృతి చిహ్నాల నమోదు కార్యక్రమం లీలగా మాత్రమే జరిగినప్పుడు ఆ అనుభవం లేదా, సన్నివేశం త్వరగా స్మృతిపథం నుంచి తొలగిపోతుంది. నమోదైన స్మృతి, తన శక్తిని కోల్పోకుండా ఉండటానికి దాన్ని అప్పుడప్పుడు రీచార్జ్ చేస్తూ ఉండాలి. లేకపోతే అది స్మృతి బ్యాంకులో నిలువ ఉండదు. జ్ఞాపకశక్తి తగ్గిపోవడానికి, స్మృతి చిహ్నాలు సరిగ్గా ఏర్పడకపోవటమో, ఏర్పడిన స్మృతిచిహ్నాలు తిరిగి రీచార్జ్ కాకపోవటమో, కాలం గడిచేకొద్దీ షేడ్ అయిపోవడమో, మరోకొత్త స్మృతి చిహ్నాలు ఏర్పాటుకు శక్తిని వినియోగించాల్సి రావటమో జరుగుతుంది. అందువల్ల మతిమరుపునకు కారణాలుగా కింది వాటిని పేర్కొనవచ్చు.
-జోక్యం
-అణచివేత
-సరిగ్గా నమోదు కాకపోవడం
-ఉపయోగించకపోవటం


No comments:

Post a Comment