Friday, 15 July 2016

How to activate our mind?


మైండ్ అదంతట అదే పనిచేసేలా చేసుకోవాలి. దాన్ని దారి మళ్లించే అంశాలకు దూరంగా ఉండాలి. ఫియర్ యాంగ్జయిటీస్, మెంటల్స్ట్రెస్, మిస్ డైరెక్టెడ్ ఆలోచనలు లేకుండా మైండ్ కేవలం చదువు మీదే దృష్టి పెట్టే విధంగా మలుచుకోవాలి. ఇది ఒక మెడిటేషన్ లాంటింది. చదువుకొని వృద్ధిలోకి రావాల్సిన మీకు అదే మీ లక్ష్యం అయినప్పుడు ఈ ధ్యానం తప్పనిసరి.

అంతరంగాన్ని యాక్టివేట్ చేసుకొనే క్రమంలో మైండ్‌ను ప్రిపేర్ చేయటం ఒక ప్రణాళికబద్ధమైన, క్రమం తప్పకుండా ప్రతిరోజు చేయాల్సిన ఒక ఎన్ఎల్పి టెక్నిక్. దీని ద్వారా మనం దేన్నయినా సరే చాలా సులభంగా నేర్చుకోగలం. వాస్తవానికి మనం దేనినైనా నేర్చుకొనే క్రమంలో మైండ్‌కు అలవికాని భారాన్ని మోపడం జరగదు. ఎందుకంటే మైండ్‌కు ఉన్న అనంత శక్తిలో మనం ఆవగింజంత మాత్రమే ఉపయోగించుకుంటున్నాం. అందువల్ల నేర్చుకొనే సమాచారం ఎక్కువ కావటం అనే కారణంతో మైండ్ తక్కువ పనిచేయటం అనేది ఉండదు. మైండ్‌కు ఉన్న శక్తిసామర్థ్యాలతో పోలిస్తే మనం స్కూళ్లు, కాలేజీల్లోనూ సంవత్సరాలవారీగా, తరగతులవారీగా నేర్చుకొనే సిలబస్ పరిమాణం చాలా తక్కువ. అయితే విద్యార్థులకు సిలబస్ పెరిగిపోవటం, బోధనాసమయం తగ్గిపోవటం వంటి మాటలు మనం ప్రస్తుతం ఎక్కువగా వింటున్నాం. ఒత్తిడి పెరిగిందనీ, పోటీ ఎక్కువైందనీ.. ఇలా స్టూడెంట్ కెరీర్లో చాలా నెగిటివ్ అంశాలను ఎక్కువగా పట్టించుకోవడం జరుగుతుంది. ఇది ఎందుకు ఏర్పడుతుందంటే సిలబస్ సరైన విధానంలో బోధన జరగడం లేదు. ఫలితంగా మైండ్‌పై అనవసరపు, అదనపు ఇబ్బందికర ప్రభావాన్ని కల్గించటం, తత్ఫలితంగా మైండ్ దృష్టి పెట్టకపోవడంతో సిలబస్ పెరిగిపోయింది కాబట్టి మైండ్ తట్టుకోలేకపోతుందని భావించటం జరుగుతున్నది.

వాస్తవానికి సరైన విధానంలో సమాచారాన్ని అందిస్తే.. ఎంత పరిమాణంలోనైనా సరే విషయాన్ని మైండ్ సేకరించుకోగలదు, గుర్తు పెట్టుకోగలదు, కావాల్సినప్పుడు అందించగలదు. అయితే మైండ్‌కు ఏర్పడే స్ట్రెస్ స్థితిని అర్థం చేసుకోవాలంటే ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. మీరు ఓ గదిలో కూర్చొని స్నేహితుడితో ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చిస్తున్నారనుకుందాం. కొద్దిసేపటికి మీ గది బయట ఎవరో సినిమా రికార్డులు ఎక్కువ సౌండ్ పెట్టారనుకోండి. ఇక్కడ మీ మైండ్ పనిచేసే విధానాన్ని ఆడిటరీ డిస్టర్బెన్స్ భగ్నపరుస్తుంది. వినికిడి వ్యవస్థ శబ్దకాలుష్యానికి గురై, దాన్ని తట్టుకొనే నిమిత్తం మీ మైండ్‌కు గల ప్రాసెసింగ్ క్యాపబిలిటీలో గణనీయమైన పరిమాణాన్ని కేటాయించాలి. ఆటోమేటిగ్గా మీ స్నేహితుడితో మీరు చర్చిస్తున్న విషయం పట్ల మీకు మూడ్ పోతుంది. ఇది మైండ్ కెపాసిటీ లోపంతో ఏర్పడింది ఏ మాత్రమూ కాదు. ఆ మైండ్‌ను అనుకూలమైన స్థితిలో ఉంచకపోవటంతో ఏర్పడిన చిన్న ఇబ్బంది. చాలా తేలికగా ఈ ఇబ్బందిని సరిచేసుకోవచ్చు. అలాగే మీ చదువు విషయంలో కూడా మీకు ఎదురవుతున్న సమస్యలు సిలబస్ పెరిగిపోవటం వల్లనో, టైం సరిపోకపోవటం వల్లనో కాదు. సవాళ్లకు దీటుగా మీ మైండ్‌ను మీరు మలుచుకోవటంలో విఫలం చెందడం. అందువల్ల మీ మైండ్‌ను యాక్టివేట్ చేసుకోవటం ఒక క్రమపద్ధతిలో సాగాలి. దీన్నే ఎన్ఎల్పీ పద్ధతిలో ప్రిపరేషన్ స్వీక్వెన్స్ అని అంటారు. అదేంటో పరిశీలిద్దాం.


సీక్వెన్స్-1
మీరు ఎంచుకున్న అనువైన స్టడీ ప్రదేశం వద్ద కుర్చీలో సౌకర్యంగా కూర్చొండి. పాదాలు నేల మీద చదునుగా ఆనాలి. చేతులను ఒళ్లో వదులుగా ఉంచుకోండి.
ఎక్సర్సైజ్ నం.1లో చేసిన శ్వాసక్రియ వ్యాయామం వరుసగా పది సార్లు చేయండి.
కళ్లు మూసుకోండి. మీ సంరక్షణాలయాన్ని ఊహించుకోండి. (మరీ ఎక్కువ సేపు గడపకండి)
ఊహ కొనసాగుతుండగా 7 అఫర్మేషన్స్ను 7 సెకన్ల విరామం ఇస్తూ ఉచ్ఛరించండి.
కనులు తెరవండి. పదిసార్లు గాఢంగా శ్వాసించండి. వెంటనే మీరు చదవాల్సిన పుస్తకం తీయండి. ఒక రఫ్ పేపర్ మీద మీరు చదవాల్సిన టాపిక్కు సంబంధించి కీలక భావనలు (మీరు నేర్చుకోదల్చిన) వరుసగా రాయండి.


సీక్వెన్స్-2
మీరు ఎంచుకున్న చక్కటి స్టడీ ప్రదేశం వద్ద మీ కుర్చిలో సౌకర్యంగా కూర్చోండి. మీ పాదాలు నేల మీద చదునుగా ఆనాలి. చేతులను ఒళ్లో వదులుగా ఉంచుకోండి.
ఎక్సర్సైజు నం.1లో చేసిన శ్వాసక్రియ వ్యాయామం వరుసగా పదిసార్లు చేయండి.
కళ్లు మూసుకోండి. ఇప్పుడు మీరు కండరాల రిలాక్సేషన్‌ను పొందండి. కనులు తెరవండి. శ్వాసక్రియ వ్యాయామం పదిసార్లు చేయండి. (కొంత అనుభవం గడించాక చేసే శ్వాసక్రియ వ్యాయామం చేయండి)
వెంటనే మీరు చదవాల్సిన పుస్తకం తీయండి. ఒక రఫ్ పేపర్ మీద మీరు చదవాల్సిన టాపిక్కు సంబంధించిన కీలక భావనలను (మీరు నేర్చుకోదలచిన) వరుసగా రాయండి. వాటిని తలుచుకుంటూ ఆయా అంశాలు మీకెంత వరకు తెలుసో గుర్తుకు తెచ్చుకుంటూ పుస్తకంలోకి వెళ్లండి.

సీక్వెన్స్-3
మీరు ఎంచుకున్న చక్కటి స్టడీ ప్రదేశం వద్ద మీ కుర్చీలో సౌకర్యంగా కూర్చోండి. పాదాలు నేలపై చదునుగా ఆనాలి. చేతులను ఒళ్లో వదులుగా ఉంచుకోండి.
నచ్చిన సంగీతం వినండి. ఎక్సర్సైజు నం.1లో చేసిన శ్వాసక్రియ వ్యాయామం వరుసగా పదిసార్లు చేయండి.
మీరు తయారుచేసుకున్న 7 అఫర్మేషన్లను 7 సెకన్ల విరామంతో గట్టిగా ఉచ్ఛరించండి.
కళ్ల మూసుకోండి. విజువలైజేషన్ టెక్నిక్‌లో రెండో భాగం (భవిష్యత్తును ఊహించుకోవటం) ఆచరించండి. అది చేస్తూ మీరు ఎంతో ప్రశాంతంగాను, ఫ్రెష్‌గాను ఉన్నట్లు పదే పదే ఊహించుకోండి.
కనులు తెరిచి పదిసార్లు వ్యాయామం చేయండి. శ్వాసక్రియ వ్యాయామంలోని రెండో రకానికి చెందిన (కొంత అనుభవం గడించాక చేసే పద్ధతి) చేయండి.
వెంటనే మీరు చదవాల్సిన పుస్తకం తీయండి. ఒక రఫ్ పేపర్ మీద మీరు చదవాల్సిన టాపిక్ తలుచుకుంటూ ఆయా అంశాల గురించి మీకెంతవరకు ఏం తెలుసో గుర్తుకు తెచ్చుకుంటూ పుస్తకంలోకి వెళ్లండి.

No comments:

Post a Comment